కలం, సినిమా : టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక ఉదయ్‌పూర్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈరోజు ఉదయం 10:10 గంటల పవిత్ర ముహూర్తంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసాడు. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు హాజరవగా వారికోసం స్పెషల్ వంటకాలతో విందుని ఏర్పాటు చేశారు. మెనూలో తెలంగాణ స్పెషల్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ ధమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చి పులుసు, కీమా సమోసాలు ఉన్నాయి. అలాగే కర్ణాటక స్పెషల్ బిసిబెలే బాత్, పంది( ఫోర్క్) కర్రీ, మైసూర్ పాక్ వడ్డించినట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు హాజరైన ప్రతీ ఒక్కరికీ స్పెషల్ స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు.
Read Also : కేరళ స్టోరీ 2కి హైకోర్టు షాక్
Follow Us On: Youtube

