కలం, వెబ్ డెస్క్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నష్టపోతున్న మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్ట్‌మెంట్ వాసులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (Prakash Goud) తీపి కబురు చెప్పారు. ఇక్కడ నష్టపోతున్న ప్రతి ఒక్కరికి మరో చోట అంతే విలువైన ఫ్లాట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం తనను కలిసిన అపార్ట్‌మెంట్ వాసులకు ప్రకాశ్ గౌడ్ హామీ ఇచ్చారు. బాధితులకు రూ.1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారు.
మూసీ సుందరీకరణ (Musi Rejuvenation) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం గాంధీ విగ్రహం నిర్మించేందుకు నిర్ణయించింది. దీని కోసం భూ సేకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్ట్మెంట్ వాసులు నష్టపోతున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లో 450 ఫ్లాట్స్‌లో కుటుంబాలు నివాసముంటున్నాయి. వారందరికీ న్యాయం జరిగేలా, ప్రస్తుతం వాళ్ల ఫ్లాట్స్ ఉన్న విస్తీర్ణంలోనే వేరొక చోట సురక్షితమైన గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టూ ఆక్యూపై ఫ్లాట్లను కేటాయించనున్నారు. ఫ్లాట్లు వద్దనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించనున్నారు. ఎమ్మెల్యే హామీతో భూసేకరణకు లైన్ క్లియర్ అయినట్లేనని చర్చ నడుస్తోంది.
Read Also : కార్ రేస్ కేస్ ప్రాసిక్యూషన్ స్పీడ్… అరవింద్ కుమార్ బదిలీ
Follow Us On: X(Twitter)

