కలం, వెబ్ డెస్క్: పట్టపగలు నడివీధిలో యువకుడిని కాల్చి చంపారు. దేశ రాజధానికి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో(Greater Noida) జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో నితిన్(25) తన ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్తున్నాడు. అప్పటికే పొంచి ఉన్న దుండగులు హఠాత్తుగా నితిన్ తుపాకులతో నితిన్ వెంటపడ్డారు. అది గమనించి నితిన్ పరిగెత్తేందుకు ప్రయత్నిస్తూ కిందపడిపోయాడు. వెంటనే ఆ యువకుడిని చుట్టిముట్టిన దుండగులు తుపాకీలతో పలుసార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే నితిన్ ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
విషయం తెలిసి ఎకోటెక్పార్క్–1 పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. సచిన్, అతని మిత్రులతో కొన్నేళ్లుగా నితిన్‌కు గొడవలు జరుగుతున్నాయని, ఆ క్రమంలోనే ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు చెలరేగకుండా, ముందు జాగ్రత్తగా కర్ఫ్యూ విధించారు.
కాగా, నిందితులు.. నితిన్‌ను (Nitin) చుట్టముట్టి తుపాకీలతో కాల్పులు జరుపుతుండగా.. వీధిలో ఆడుకుంటున్న పిల్లలు భయపడి పరుగులు తీశారు. గోల గమనించి సమీపంలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళను దుండగులు తుపాకీతో బెదిరించారు. ఈ తతంగమంతా అక్కడ అమర్చిన ఓ సీసీ కెమెరాలో రికార్డయింది(Greater Noida). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Read Also: కామారెడ్డి జిల్లాలో అరుదైన వేడుక.. ట్విన్ బ్రదర్స్‌ను పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్
Follow Us On : WhatsApp

