కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో పార్కులు, చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన హైడ్రా (Hydra) ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితుల నుంచి భారీ స్పందన లభించింది. పాతబస్తీ లాల్‌దర్వాజాలో ఒకప్పుడు గ్రామకంఠంగా ఉన్న 2 ఎకరాల స్థలం పూర్తిగా కబ్జాకు గురైందని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే, సికింద్రాబాద్ (Secunderabad) లోని హస్మత్‌పేట బోయిన్ చెరువు ఆక్రమణలపై నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు 66 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, ప్రస్తుతం కబ్జాల కారణంగా కేవలం 30 ఎకరాలకే పరిమితమైందని ఆరోపించారు. తక్షణమే స్పందించి మిగిలిన చెరువునైనా కాపాడాలని కోరారు.
మొత్తంగా అందిన 59 వినతులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.


