epaper
Monday, February 23, 2026
epaper

డేటా షేరింగ్​పై సీసీఐ ఆదేశాలకు ఓకే.. వాట్సాప్, మెటా​​

కలం, వెబ్​ డెస్క్​: వినియోగదారుల డేటాను షేర్​ చేసేముందు తప్పనిసరిగా వాళ్ల అనుమతి తీసుకోవాలన్న సీసీఐ మార్గదర్శకాలకు వాట్సాప్​(WhatsApp), మెటా ఓకే చెప్పాయి. ఈ మేరకు తమ సమ్మతిని సుప్రీంకోర్టుకు (Supreme Court) నివేదించాయి. దీనిపై తాము దాఖలు చేసిన పిటిషన్లు వెనక్కు తీసుకున్నాయి. సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా మార్చి 16లోపు మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పాయి.

వాట్సాప్​ తన వినియోగదారుల డేటాను మాతృసంస్థ మెటా, దాని అనుబంధ ప్లాట్​ఫ్లామ్స్​తో పంచుకునే ముందు తప్పనిసరిగా యూజర్ల అనుమతి తీసుకోవాలని 2024లో కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా(CCI) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వాట్సాప్​, మెటా సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, జస్టిస్​ విపుల్​ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

పిటిషనర్ల తరఫున సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​ హాజరై.. సీసీఐ నిబంధనలకు తన క్లయింట్లు అంగీకరించారని చెప్పారు. దీంతో పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి ధర్మాసనం అనుమతించింది. అయితే, 2021 గోప్యతా హక్కు చట్టం, రూ.213 కోట్ల జరిమానాపై దాఖలైన ప్రధాన పిటిషన్​ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

వివాదం ఏంటంటే..

వాట్సాప్ (​WhatsApp) 2021లో కొన్ని కొత్త నిబంధనలు తెచ్చింది. అందులో ముఖ్యమైనది.. డేటా షేరింగ్​పై ఉన్న ‘ఆప్ట్​ అవుట్’ రూల్ తొలగించి ‘టేక్​ ఇట్​ ఆర్​ లీవ్​’ ప్రవేశపెట్టడం. ఇది వినియోగదారులు తమ డేటాను ఫేస్​బుక్​ (ప్రస్తుతం మెటా)తో పంచుకోవడం తప్పనిసరి చేసింది. వాట్సాప్​ పనిచేయాలంటే ఈ ‘టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్’ ఆప్షన్​కు కచ్చితంగా యూజర్లు అంగీకరించేలా చేయడంపై సీసీఐ విచారణ జరిపింది. వాట్సాప్​ నిబంధన భారత చట్టంలోని గోప్యతా హక్కుకు భంగం వాటిల్లేలా ఉందంటూ తేల్చింది. రూ.213.14 కోట్ల జరిమానా విధిస్తూ, వాట్సాప్​లో (WhatsApp) సేకరించిన డేటాను మెటా లేదా దాని సంస్థలతో ఐదేళ్ల పాటు పంచుకోరాదని ఆదేశించింది. దీనిని మొదట ఎన్​సీఎల్​టీలో వాట్సాప్​, మెటా సవాల్​ చేశాయి. అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

Read Also: క్యాబినెట్ భేటీకి దూరంగా మంత్రి తుమ్మల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>