epaper
Monday, February 23, 2026
epaper

పాలు కల్తీవా, స్వచ్ఛమైనవా.. ఇంట్లోనే ఇలా చెక్ చేయండి

కలం, డెస్క్ : ఈ రోజుల్లో ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తెలియక జనాలు అనారోగ్యం పాలు అవుతున్నారు. తాజాగా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు చనిపోయారు. పదుల కొద్దీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి భయంకరమైన కల్తీ పాలు  (Milk Test) హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రతిరోజూ వేల లీటర్లు సరఫరా అవుతున్నాయి. స్టార్చ్, యూరియా, డిటర్జెంట్, కొన్ని రకాల కెమికల్స్ కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు.

వాటికి ఓ బ్రాండ్ పేరు పెట్టేసి అమ్ముతున్నారు. కొన్ని సార్లు కల్తీ పాలకు ఫేమస్ బ్రాండ్ కంపెనీల పేర్లు పెట్టేసి గుర్తుపట్టలేకుండా చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి వాటిని తాగితే ఆరోగ్యం కుప్పకూలయం ఖాయం. అందుకే మనం తాగే ప్యాకెట్ పాలు అయినా, ఓపెన్ గా కొంటున్నవి అయినా సరే.. కల్తీ జరిగినవా లేవా అనేది కచ్చితంగా తెలుసుకోవాలి (Milk Test). ఇందుకోసం ఏ ల్యాబ్ సెంటర్ కో వాటిని తీసుకెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు.

పరీక్షించడం ఎలా..?

– మీరు కొన్న పాలను ఒక సీసాలో పోసి.. అదే సైజులో నీటిని కూడా కలపండి. ఆ తర్వాత కొంచెం అటు ఇటు కదిలించండి. నురుగు ఎక్కువ వస్తే అందులో డిటర్జెంట్ కలిపారని అర్థం చేసుకోవాలి.

-ఒక గ్లాసు లేదా చిన్న బౌల్ లో టీ స్పూన్ పాలను తీసుకుని.. అందులో అరటీస్పూన్ సోయాబిన్ పౌడర్ కలపాలి. పది నిముషాల తర్వాత అందులో లిట్మస్ కాగితం ముంచండి. ఒకవేళ కాగితం బ్లూ కలర్ లోకి మారితే ఆ పాలల్లో యూరియా కలిపినట్టే.

– ఒకవేళ మీరు పాలను మరిగించినప్పుడు పసుపు రంగులోకి మారితే అందులో కెమికల్స్ కలిపారని అర్థం చేసుకోవాలి.

– మీరు కొన్న పాలను ఇంట్లో ఫ్లాట్ గా ఉండే కిచెన్ లేదా ఫ్లోర్ పై రెండు చుక్కలను వేయండి. అది ఏదో ఒక సైడ్ పారుతుంది. అలా పారిన సైడ్ తెల్లగా ఉంటే అవి స్వచ్ఛమైనవని అర్థం. తెల్లగా లేకుంటే అవి కల్తీ పాలు.

– షాపుల్లో దొరికే పీహెచ్ స్ట్రిప్‌ ను తీసుకొచ్చి దాని మీద ఒక చుక్క పాలను వేయండి. ph రేషియో 6.4 – 6.6 మధ్యలో ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవి. ఒకవేళ ఈ రేషియో ఎక్కువ లేదా తక్కువ ఉంటే అవి కల్తీ పాలు.

– పాలను ఒక పాత్రలో 5 మిల్లీలీటర్ల దాకా తీసుకోండి. అందులో 2 మిల్లీ లీటర్ల అయోడిన్ వేసి కలపండి. పాలు లేత గోధుమ రంగులోకి మారితే అవి స్వచ్ఛమైనవి. ఒకవేళ లైట్ చాక్లెట్ కలర్ లేదా బ్లూ కలర్ లోకి మారితే అవి కల్తీ జరిగినట్టే.

– ఇదే కాకుండా పాలను చేతితో తాకినప్పుడు సబ్బులాగా అనిపించినా.. చేతి నుంచి త్వరగా జారిపోతున్నట్టు కనిపించినా అవి కల్తీ పాలు అని గుర్తించాలి.

Read Also: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాద మృతులే ఎక్కువ: వరంగల్ సీపీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>