epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన వాయిదా

ఇజ్రాయెల్‌(Israeli) ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) భారత పర్యటన వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో ఆయన మనదేశంలో పర్యటించాల్ిస ఉంది. అయితే ఢిల్లీలో పేలుడు ఘటన నేపథ్యంలో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఎర్రకోట బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నెతన్యాహు పర్యటనను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు ఇజ్రాయెల్‌ అధికార యంత్రాంగం తెలిపింది.

పలు వాయిదాలతో నిలిచిపోయిన పర్యటన

నెతన్యాహు(Benjamin Netanyahu) చివరిసారిగా 2018లో భారత్‌‌లో పర్యటించారు. ఆ తర్వాత ఈ ఏడాది చివరిలో మరోసారి రావాలని నిర్ణయించినా, షెడ్యూల్‌ అడ్డంకులు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అంతర్గత పరిణామాల కారణంగా పర్యటన పలు మార్లు వాయిదా పడింది. సెప్టెంబరు 9న రావాల్సిన పర్యటనను కూడా షెడ్యూల్ సమస్యల కారణంగా రద్దు చేశారు. ఈ సంవత్సరానికిగాను పర్యటన పూర్తిగా రద్దయినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ లేదా భారత తరఫున పర్యటన వాయిదాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, రెండు దేశాల భద్రతా వ్యవస్థలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయని, ముఖ్యంగా ప్రధాని నెతన్యాహు భద్రతా ప్రోటోకాల్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాదిలో ఆయన భారత్‌ పర్యటనకు అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

మోదీ, నెతన్యాహు బంధం

2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చారిత్రకంగా టెల్‌అవీవ్‌‌లో పర్యటించిన తర్వాత, నెతన్యాహు 2018లో భారతలో పర్యటిస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, ఇన్నోవేషన్ వంటి అనేక రంగాలలో భారత్–ఇజ్రాయెల్‌ భాగస్వామ్యం బలపడుతూ వస్తోంది. నెతన్యాహు రాబోయే పర్యటన కూడా ద్వైపాక్షిక సహకారం మరింత విస్తరించడానికి కీలకమైందిగా భావించారు.

Read Also: ఢిల్లీలో కాలుష్యం.. పర్యావరణశాఖ సంచలన నిర్ణయం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>