Mobile Popup Ad
Mobile Popup Ad

శింబు ‘అరసన్’లో మరో స్టార్ హీరో.. పోస్టర్ రిలీజ్‌తో పెరిగిన హైప్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నేషనల్ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో టాప్ స్టార్ శింబు (STR) హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా ‘అరసన్(Arasan)’పై అప్పటికే భారీ హైప్ ఉంది. ఇది శింబు కెరీర్‌లో 49వ సినిమా కూడా. దీంతో అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ‘అరసన్’ అంటే “రాజు” అని అర్థం. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్‌లో హైప్ పెంచింది. ఈ పోస్టర్‌లో శింబు వింటేజ్ లుక్‌లో ఉన్నాడు. అతని చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు.. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్.. ఇది కచ్చితంగా వెట్రిమారన్ మార్క్ యాక్షన్ డ్రామా అని ఫీలవుతున్నారు. ఈ సినిమా ‘వాడ చెన్నై యూనివర్స్’ లో భాగం అని కూడా కొందరు అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఇప్పుడు ఈ మూవీ మీద హైప్‌ని రెట్టింపు చేసే సంచలన అప్‌డేట్ వచ్చింది. ‘అరసన్(Arasan)’ చిత్రంలో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అతనే వెర్సటైల్ స్టార్ విజయ్‌ సేతుపతి. ఈ పాత్ర పెద్దదా చిన్నదా అన్నది పక్కన పెడితే, ఆయన ఏ రోల్‌లో అయినా పూర్తిగా ఇమిడిపోతారనే సంగతి తెలిసిందే. ‘అరసన్’లో విజయ్(Vijay Sethupathi) గెటప్‌ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చూసిన ఫ్యాన్స్ తెగ ఎగ్జయిట్ అవుతున్నారు. వెట్రిమారన్ – శింబు – విజయ్ సేతుపతి కాంబో స్క్రీన్ మీద రెచ్చిపోవడం ఖాయమని ఫీలవుతున్న ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also: “తెలుసు కదా” కథ దొంగిలించారు.. యువకుడి సంచలన ఆరోపణ

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>