epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఐబొమ్మ కేసులో షాకింగ్‌ నిజాలు!

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi) విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూసినట్లు తెలస్తోంది. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయని, రవికి మొదటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా రవి విచారణలో వెలువడిన పలు కీలక విషయాలను అధికారులు తెలిపారు.

రవి విచారణలో బయటపడిన అంశాలివే..

రవికి సంబంధించిన పలు అంశాలపై అతడి భార్యను కూడా పోలీసులు ప్రశ్నించారు.

విచారణలో ఆమె వెల్లడించిన వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

భార్య, పిల్లలపై తరచుగా రవి చిత్రహింసలకు పాల్పడేవాడని అతని భార్య ఆరోపించింది.

రవి(Immadi Ravi) ప్రవర్తన దారుణంగా మారడంతో విడాకులు తీసుకున్నట్టు పోలీసులు తెలిపినట్లు సమాచారం.

రవి పలు నేరాలకు స్నేహితుల గుర్తింపు కార్డులను వినియోగించేవాడని విచారణలో తేలింది.

ఇక, ఐబొమ్మ వెబ్‌సైట్ కార్యకలాపాలపై విచారణలో కూడా కీలకమైన విషయాలు బయటపడ్డాయి.

ఐబొమ్మ(ibomma)కు సంబంధించిన ఒక పోస్టర్‌ డిజైన్ చేసినందుకు నిఖిల్‌ అనే వ్యక్తికి రవి ప్రతి నెల 50 వేల రూపాయలు చెల్లించేవాడని అధికారులు తెలిపారు.

సైట్‌లో ఉద్దేశపూర్వకంగా ‘బెట్టింగ్ బగ్’ పెట్టి అదనపు ఆదాయం పొందేవాడని విచారణలో స్పష్టమైంది.

ప్రతి లక్ష వ్యూస్‌కు రవికి 50 డాలర్లు వచ్చేవని పోలీసులు కనుగొన్నారు.

Read Also: గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>