కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ (Karimnagar) నగర మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(Kolagani Srinivas) బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్‌గా తొలి రోజే నగర అభివృద్ధిపై దృష్టి సారించిన శ్రీనివాస్, ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చారు.
నగర ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన మంజూరు పత్రాలపై తొలి సంతకం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నగర సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని మేయర్ శ్రీనివాస్ (Kolagani Srinivas) పేర్కొన్నారు.
Read Also: సవాళ్లు, ప్రతిసవాళ్లు.. కామారెడ్డిలో మరోసారి ఉద్రిక్తత
Follow Us On: Instagram


