Mobile Popup Ad
Mobile Popup Ad

ఫెరారీ కారు బీభత్సం : బాలకృష్ణ ఇంటి వద్ద యాక్సిడెంట్​

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) రోడ్ నంబర్ 45లో గల సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన ఒక ఫెరారీ కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పక్క రోడ్డులోకి (Ferrari Car Crash) దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ కారు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడమే కాకుండా, ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను, బైక్‌లను కూడా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలన్నీ రోడ్డుపై అడ్డదిడ్డంగా పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న వాహనాలను క్రేన్ల సహాయంతో తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>