epaper
Sunday, February 22, 2026
epaper

రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ

కలం, వెబ్​ డెస్క్​ : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) మరణం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన కూసుమంచి పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. నార్కట్ పల్లి – నకిరేకల్ మధ్య శ్రీనివాస్ ను నిందితులు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

హత్య అనంతరం మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్ లో పడేసిన నిందితులు, ఈ ఘటనను కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో శ్రీనివాస్ (Boggula Srinivas) పవన్ కళ్యాణ్ పై రాసిన పుస్తకానికి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం డబ్బుకు సంబంధించిన వివాదాలే ఈ దారుణానికి దారి తీశాయని వివరించారు.

Read Also: కరీంనగర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొలగాని శ్రీనివాస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>