epaper
Sunday, February 22, 2026
epaper

‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్.. ‘వారణాసి’ గ్లింప్స్ తో డబుల్ ట్రీట్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) ఎంతటి సంచలనం విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోని నాటు, నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ఏంటో నిరూపించింది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి నాలుగేళ్ళు గడుస్తుండటంతో అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘రీగల్’ స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేసింది.

మార్చి నెలలో ప్రతీరోజు ఒక ఆస్కార్ నామినేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించే దానిలో భాగంగా మార్చి 2వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్స్ తో పాటు వారణాసి (Varanasi) గ్లింప్స్ వీడియోను అటాచ్ చేయనున్నారు. దీనితో అంతర్జాతీయ ప్రేక్షకులకు వారణాసి చిత్రాన్ని పరిచయం చేయడమే కాకుండా.. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణ గాధ గురించి ఒక ఇంటర్నేషనల్ మూవీ వస్తుందని తెలిపే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ (RRR) కోసం వచ్చిన ప్రేక్షకులకు వారణాసి వీడియోతో రాజమౌళి డబుల్ ట్రీట్ అందిస్తున్నారు.

Read Also: జోర్ధాన్ షూట్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>