Mobile Popup Ad
Mobile Popup Ad

జోర్ధాన్ షూట్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల షూటింగ్ కోసం జోర్దాన్ (Jordan) వెళ్ళిన మూవీ యూనిట్ అక్కడ కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. మార్చి 6 వరకు జోర్దాన్ షెడ్యూల్ ఉన్నా.. మూవీ యూనిట్ హైదరాబాద్ వచ్చేస్తుంది. జోర్దాన్‌లో ప్రధాన యాక్షన్ సీన్స్ పూర్తి చేసిన టీం. కొన్ని లింక్ద్ సీన్స్ కోసం జూనియర్ ఆర్టిస్టుల ఇబ్బంది రావడంతో.. హైదరాబాద్ లోనే స్పెషల్ సెట్ వేసి ఘాట్ చేయాలని జోర్ధాన్  షెడ్యూల్ లో మార్పులు చేసింది. తాజాగా ఎన్టీఆర్ (NTR) జోర్ధాన్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి  చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read Also: బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>