కలం, వెబ్ డెస్క్ : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–సౌత్ ఆఫ్రికా(India vs South Africa) మ్యాచ్ నేడు జరగనుంది. ఇరు జట్లు సూపర్ 8 దశలో భాగంగా పరస్పరం తలపడనున్నాయి. ఈ కీలక పోరు నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన ఈ మైదానం మరో ఉత్కంఠభరిత పోరుకు సిద్ధమైంది.
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) చరిత్రలో సౌత్ ఆఫ్రికాపై ఇండియా ఐదుసార్లు విజయం సాధించింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు, సౌతాఫ్రికా కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. సూపర్ 8లో మొదటి మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు ఇది అత్యంత కీలకం కానుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అవసరం. మరి ఈ కీలక మ్యాచ్ లో ఎవరికి విజయం వరించనుందో చూడాలి.
Read Also: జోర్ధాన్ షూట్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్
Follow Us On: Instagram


