Mobile Popup Ad
Mobile Popup Ad

ఆరు నెలల పసికందు మృతి: ఆ మందులే కారణమా?

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాధకరమైన ఘటన చోటుచేసుకున్నది. జ్వరం చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఆరు నెలల పసికందు, గడువు తీరిన మందుల కారణంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, రాము అనే ఆరు నెలల చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఒక స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు బాబును పరీక్షించి కొన్ని మందులను అందించారు. అయితే ఆ మందులు వాడిన తర్వాత చిన్నారి పరిస్థితి విషమించి మరణించాడని, తాము పరిశీలిస్తే ఆ మందుల గడువు అప్పటికే ముగిసిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషాదకర ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం, చిన్నారి మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.

Read Also: నేటి మ్యాచ్ అభిషేక్ శర్మకు అగ్నిపరీక్ష

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>