epaper
Sunday, February 22, 2026
epaper

తాలిబన్ స్థావరాలపై పాక్ పంజా : TTP క్యాంపులు ధ్వంసం

కలం, వెబ్​ డెస్క్​ : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అఫ్గానిస్థాన్ భూభాగంలోని తాలిబన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడులు (Pakistan Airstrikes) నిర్వహించింది. తూర్పు అఫ్గానిస్థాన్‌లోని పలు జిల్లాల్లో పాక్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సుమారు 23 మంది వరకు మరణించినట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ అంతర్గతంగా వరుస ఆత్మాహుతి దాడులతో అల్లాడిపోతోంది. ఈ దాడుల వెనుక అఫ్గాన్ సరిహద్దుల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల హస్తం ఉందని భావించిన పాక్ ప్రభుత్వం, తక్షణ ప్రతీకార చర్యలకు దిగింది. నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దు దాటిన యుద్ధ విమానాలు, ఉగ్రవాద శిబిరాలను మట్టికరిపించాయి. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Read Also: మావోయిస్టు పార్టీకి భారీ షాక్​: అగ్రనేతలు లొంగుబాటు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>