epaper
Sunday, February 22, 2026
epaper

ఫ్లయింగ్ కిస్ ఇస్తే జైలుకే.. ముంబై కోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్: ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం తీవ్ర నేరమేనని ముంబై (Mumbai) కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల క్రితం ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో ముంబైకి చెందిన ఓ వ్యక్తికి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2017 ఓ బాలిక పాఠశాల నుంచి స్కూల్‌కు వెళ్తుండగా నిందితుడు అమెను ఫాలో అయ్యాడు. అక్కడితో ఆగకుండా బాలికవైపు చూస్తూ ‘ఫ్లయింగ్ కిస్’ (Flying Kiss) ఇచ్చాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. నిందితుడు కోర్టులో వాదిస్తూ తాను కేవలం సైగలు మాత్రమే చేశానని, అది నేరం కాదని పేర్కొన్నాడు. అయితే నిందితుడి చర్యలు బాధితురాలికి తీవ్ర భయాన్ని కలిగించాయని ప్రాసిక్యూషన్ బలంగా వాదించింది. అమ్మాయిల పట్ల ఇలాంటి అనుచిత ప్రవర్తన (Flying Kiss) గౌరవాన్ని దెబ్బతీస్తుందని కోర్టు చెప్పింది. చివరికి, ప్రత్యేక కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది. తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పు వేధింపులకు గురయ్యే మహిళలు, బాలికలకు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.

Read Also: ‘సర్’తో అలజడి తప్పదా?.. బెంగాల్‌లో తెలంగాణ పోలీస్ స్టడీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>