Mobile Popup Ad
Mobile Popup Ad

వాళ్లు వెంటనే బీజేపీ నుంచి వెళ్లిపోవాలి : ఎంపీ అర్వింద్

కలం, డెస్క్ : ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) బీజేపీలో కోవర్టులు ఉన్నారంటూ సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణలో 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్నారని.. వాళ్లు వెంటనే బీజేపీ నుంచి వెళ్లిపోవాలన్నారు. పలువురు పాత నాయకులను కోవర్టులతో ఎంపీ అర్వింద్ పోల్చడం సంచలనంగా మారింది. కోవర్టుల వల్లే తాము ఎంత కష్టపడుతున్నా.. రిజల్ట్ ఆ స్థాయిలో రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి బలం పెరిగిందని.. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడిందని చెప్పారు.

దక్షిణ తెలంగాణలో పార్టీ బలపడాల్సి ఉందని.. అక్కడ కూడా తమకు పట్టు దొరికితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తమదే విజయం అంటూ తెలిపారు ఎంపీ అర్వింద్. కాంగ్రెస్ పార్టీ డబ్బులతో కొనుగోళ్లు చేసి మున్సిపాలిటీలను దక్కించుకుందని విమర్శించారు. అలాంటి పార్టీని ఎవరూ నమ్మరని.. అందుకే ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బ పడిందని ఎంపీ అర్వింద్ (MP Arvind) చెప్పుకొచ్చారు.

Read Also: ‘సిద్ధిపేట వేదిక’… కవిత సంచలన సవాల్!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>