epaper
Monday, February 23, 2026
epaper

పెళ్లిళ్ల సీజ‌న్‌… పెరుగుతున్న‌ బంగారం, వెండి ధ‌ర‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: పెళ్లిళ్ల సీజ‌న్ వేళ బంగారం, వెండి ధ‌ర‌లు (Gold Silver Prices) మ‌ళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెద్ద‌గా మార్పులు లేని ధ‌ర‌లు మ‌ళ్లీ పైపైకి వెళ్తున్నాయి. గురువారం మ‌రోసారి ధ‌ర‌ల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) బుధ‌వారం రూ.1,54,200 ఉండ‌గా నేడు రూ.2,290 పెరిగి రూ.1,56,490కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధ‌వారం రూ.1,41,350 ఉండ‌గా నేడు రూ.2,100 పెరిగి రూ.1,43,450కి చేరుకుంది. మ‌రోవైపు వెండి ధ‌ర‌(Silver Price)లు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర బుధ‌వారం రూ.2,60,000 ఉండ‌గా నేడు రూ.10,000 పెరిగి ప్ర‌స్తుతం రూ.2,70,000కు చేరుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>