కలం, సినిమా : కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ (Toxic) రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అలాగే రేపు (ఫిబ్రవరి 20) ఉదయం 9.35 గంటలకు ‘టాక్సిక్’ (Toxic) టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘కేజీయఫ్’ (KGF) సిరీస్ తరువాత యశ్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. టీజర్ విడుదలతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశముంది.


