epaper
Thursday, February 19, 2026
epaper

కడియం కావ్యని అభినందించిన వేం నరేందర్ రెడ్డి

కలం, మహబూబాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంలో, చైర్మన్ స్థానాలు కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya)ను ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) ప్రత్యేకంగా అభినందించారు. తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఎంపీ కడియం కావ్యను ప్రశంసించారు.

అలాగే స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి సైతం వేం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా రెడ్డియాల పర్యటనలో ఉన్న వేం నరేందర్ రెడ్డిని (Vem Narender Reddy) ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జాటోత్‌ రామచంద్రునాయక్‌, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘దానం’ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాతే స్పీకర్ డెసిషన్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>