epaper
Thursday, February 19, 2026
epaper

వై​సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్​ లీగల్​ నోటీస్​

కలం, వెబ్​ డెస్క్​: వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కు హెరిటేజ్​ సంస్థ లీగల్​ నోటీస్​ ఇచ్చింది. సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని అందులో పేర్కొంది. అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు హెరిటేజ్​ తరఫున న్యాయవాది మల్లికార్జున రావు లీగల్​ నోటీసులు పంపారు.

‘హెరిటేజ్​ సంస్థ ఎన్నో ఏళ్లుగా చట్ట ప్రకారం నడుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందింది. ఫుడ్​ సేఫ్టీ రూల్స్​ను పాటిస్తోంది. అలాంటి మా సంస్థపై దుష్ర్పచారం చేశారు. ఇందాపూర్​ డెయిరీతో సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేశారు. 22 సంస్థలతో హెరిటేజ్​ సిండికేట్​ అయ్యిందని నిరాధార ఆరోపణలు చేశారు. ప్రజల్లో హెరిటేజ్​ సంస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. దీనిపై తక్షణమే బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సివిల్​, క్రిమినల్​ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>