epaper
Thursday, February 19, 2026
epaper

లంచం డిమాండ్ చేశాడని వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ సర్పంచ్

కలం, మెద‌క్ బ్యూరో: లంచం డిమాండ్ చేశాడ‌నే కారణంతో ఓ మాజీ సర్పంచ్ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట (Siddipet) జిల్లా రాయ‌పోల్ మండ‌లం పెద్దఆరేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తాను స‌ర్పంచ్‌గా ఉన్నప్పుడు చేసిన పనుల బిల్లులు పంచాయతీ సెక్రటరీ ఇవ్వడం లేదని ఆరోపించాడు. ఎన్ని సార్లు తిరిగినా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని అరోపించాడు. బిల్లులు మంజూరు చేయాలంటే రూ. 1,50,000 లంచం డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ వాటర్ ట్యాంక్ (Water Tank) ఎక్కాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తానని బెదిరించడంతో రాయపోల్ ఎంపీడీవో, దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ బుజ్జిగించి కింద‌కు దించే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు నాలుగు గంట‌ల‌కుపైగా వాటర్ ట్యాంక్‌పై మాజీ సర్పంచ్‌ ఉండిపోవడంతో అయ‌న కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులు అందోళ‌న వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>