కలం, డెస్క్ : మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) ఎప్పటికప్పుడు ఆసక్తికర కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా సీఎంఆర్ యూనివర్సిటీలో స్టూడెంట్లు కొన్ని స్కిట్లు వేశారు. మల్లారెడ్డి ఓ స్కిట్ లో పాల్గొని శివుడి వేశం వేసిన విద్యార్థితో కొద్దిసేపు స్టేజిపై మాట్లాడారు. నీకు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి, గవర్నర్ పదవుల్లో ఏది కావాలని ఆ స్కిట్ లో శివుడి పాత్ర వేసిన విద్యార్థి అడుగుతాడు. మల్లారెడ్డి స్పందిస్తూ… ‘మనిషి ఆశాజీవి స్వామి. నేను మానవుడిని. మీ ఆశీర్వాదం స్వామి’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఆ తర్వాత శివుడి పాత్ర మాట్లాడుతూ.. ‘మన తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లి వచ్చిన వారు సీఎం అవుతారనే ట్రెండ్ ఉంది కదా.. అలా నీకు ఏమైనా కావాలని ఉందా’ అని అంటాడు. దానికి మల్లారెడ్డి (Malla Reddy) రిప్లై ఇస్తూ.. ‘నాకు విద్యార్థుల విజయం, ప్రజల ప్రేమ చాలు స్వామీ’ అంటూ చెబుతాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మల్లారెడ్డి మొత్తానికి సీఎం పదవి కావాలని ఉందని ఈ విధంగా బయటపెట్టాడన్నమాట అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. తన స్టూడెంట్లతో తానే స్కిట్ వేయించుకుని.. తనకు తగ్గట్టు స్క్రిప్టు రాయించుకుని నటించాడంటూ ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా మల్లారెడ్డి వేసిన స్కిట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: హాట్ టాపిక్: కుర్చీకోసం కుమ్మక్కు రాజకీయాలు
Follow Us On : WhatsApp


