epaper
Wednesday, February 18, 2026
epaper

ఇజ్రాయెల్​ టూరిస్ట్​​పై రేప్​.. ముగ్గురికి మరణశిక్ష

కలం, వెబ్​డెస్క్​: గతేడాది ఇజ్రాయెల్​ పర్యాటకురాలి (Israel Tourist Rape) తోపాటు మరో మహిళపై అత్యాచారం, వాళ్ల వెంట ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులకు మరణశిక్ష పడింది. ఈ మేరకు కర్ణాటకలోని కొప్పళ​ జిల్లా సెషన్స్​ కోర్ట్​ సోమవారం తీర్పు వెల్లడించింది.

నిరుడు మార్చిలో ఇజ్రాయెల్​కు చెందిన ఓ మహిళ(27), అమెరికాకు చెందిన డేనియల్​(23), నాసిక్​కు చెందిన పంకజ్​(43), ఒడిశాకు చెందిన డిబాస్​ (42).. చారిత్రక పర్యాటక కేంద్రం హంపిని చూసేందుకు వచ్చారు. అక్కడికి సమీపంలోని ఆనెగొందిలో ఓ ఇంట్లో(హోం స్టే) బస చేశారు. మార్చి 6న సణాపురలోని తుంగభద్ర ఎడమ కాల్వ సమీపంలో ఓ మ్యూజిక్​ షోకు ఈ నలుగురితో పాటు హోం స్టేకు చెందిన మహిళ వెళ్లారు.

అక్కడ వీళ్లు ఉండగా, మల్లేశ్​ అలియాస్​ హందిమల్ల, సాయి, శరణప్ప వచ్చి డబ్బు డిమాండ్​ చేశారు. వాళ్లు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవ పడ్డారు. డేనియల్​, పంకజ్​, డిబాస్​ను తుంగభద్ర కాల్వలోకి తోశారు. నీళ్లలో కొంతదూరం కొట్టుకుపోయిన తర్వాత డేనియల్​, పంకజ్​ ఎలాగోలా ఒడ్డుకు చేరారు. కానీ, డిబాస్​ కొట్టుకుపోయి మృతి చెందాడు. ఒడ్డుకు చేరినవాళ్లు తిరిగి వచ్చేలోగా ఇజ్రాయెల్​ మహిళ, హోం స్టే నిర్వాహకురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు (Israel Tourist Rape).

ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును త్వరగా తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసింది. నిందితులు నేరం చేసినట్లు రుజువు కావడంతో అత్యాచారం, హత్య కేసు ముగ్గురికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Read Also: నేను ఆశాజీవిని.. పరమశివుడు ఇస్తే ఆ పదవి తీసుకుంటా : మల్లారెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>