epaper
Wednesday, February 18, 2026
epaper

చైర్​పర్సన్​ పదవి నిరాకరణ.. కంటతడి పెట్టిన మహిళా కౌన్సిలర్

కలం, యాదాద్రి భువనగిరి : భువనగిరి (Bhuvanagiri) ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని కౌన్సిల్ మొదటి సమావేశంలో 11వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణి కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Anil Kumar Reddy) మొదటి నుంచి చైర్‌పర్సన్ పదవి తనకు ఇస్తానని మాట ఇచ్చి 35వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన తంగళ్ళపల్లి శ్రీవాణిని ఎన్నుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ స్థానంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

బొమ్మయిపల్లి గ్రామాన్ని భువనగిరి మున్సిపాలిటీ (Bhuvanagiri Municipality) లో కలిపినా కూడా లోకల్ నాన్ లోకల్ అనే బేధాలు ఎందుకు వస్తున్నాయన్నారు. కాగా, మొదటి నుంచి 11వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణికి (Ganji Srivani) అధ్యక్ష పీఠం దక్కుతుందని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో అంచనాలు తారుమారయ్యాయి. దీంతో ఆమె కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ముందు కంటతడి పెట్టుకున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also: నల్లగొండ నగరాభివృద్ది కోసం కలిసి పని చేయాలి : మంత్రి కోమటి రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>