epaper
Wednesday, February 18, 2026
epaper

రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయం : ఎమ్మెల్యే వేముల వీరేశం

కలం, నల్లగొండ బ్యూరో : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ సర్కారుపై విశ్వాసం ఉంచి గెలిపించారని . చిట్యాల మున్సిపాలిటీలో నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పందిరి గీతా రమేశ్, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సత్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రజల తరహాలోనే పట్టణ ప్రజలు సైతం కాంగ్రెస్‌కే పట్టం కట్టారన్నారు. ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీనిచ్చారు.

ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని, సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. బతుకమ్మ కుంట అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధే ధ్యేయమన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం చెర్మన్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vemula Veeresham
Vemula Veeresham

Read Also: ఇండియా-పాక్ పెద్ద మ్యాచ్ కాదు : గంగూలీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>