epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ ఫలితాలు.. ప్రతిపక్షాలకు చెంపపెట్టు : డిప్యూటీ సీఎం భట్టి

కలం, ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ (Congress) పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే బలంగా ఉంది.. పట్టణ ప్రాంతాల్లో బలహీనంగా ఉందని కొన్ని పార్టీలు చేసిన ప్రచారానికి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టుగా తీర్పునిచ్చారనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) వ్యాఖ్యానించారు. సోమవారం మధిరలో జరిగిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ శాసనసభ, పార్లమెంటు పంచాయతీ ఎన్నికలతో పాటు పట్టణ ప్రాంతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన బలాన్ని నిరూపించిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా పట్టణ ప్రాంతాల్లో ఏ పార్టీకి రాని భారీ మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి విజయం అందించిన ఓటర్లకు డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti) కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం వంటి అత్యంత ప్రధానమైన అంశాలతో గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర క్యాబినెట్ మంత్రులందరూ సమిష్టిగా అర్బన్ సెంటర్స్‌ను అభివృద్ధి చేశారు.. అనడానికి ప్రస్తుత ఫలితాలు  నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం ఉంచి ఓటు వేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమం మేలు కలయికతో మరింత బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందనీ తెలిపారు.

Read Also: నల్లగొండ నగరాభివృద్ది కోసం కలిసి పని చేయాలి : మంత్రి కోమటి రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>