కలం, నల్లగొండ బ్యూరో : కొట్లాడుకుంటే కేసీఆర్ పాలన లాగా అవుతామని, మేయర్‌తో సహకరించి నల్లగొండ నగరాభివృద్దికి కలిసి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation) నూతన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం మంత్రి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల కార్పొరేటర్‌లకు సన్మానం చేశామని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరు సహకరించుకోవాలని సూచించారు. మూడేళ్ళ వరకు రాజకీయాలు మాట్లాడనని, అభివృద్దిపైనే దృష్టి పెడతామని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అంటేనే అభివృద్ధి.. నాకు పదవులు ముఖ్యం కాదని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నల్లగొండ కార్పొరేషన్ మూడేళ్లలో నేషనల్ అవార్డు సాధించాలని, నగరంలో తాగునీటి వ్యవస్థ సరిగా లేదని, వెంటనే నీటి సరఫరా మెరుగుపర్చాలని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు నా కల.. ఆ కల సాకారమై.. ఇవాళ అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే నా మనసు గర్వంతో నిండిపోయిందన్నారు. నల్లగొండ నా జన్మభూమి.. ఇక్కడి ప్రతి గల్లీ నా గుండె చప్పుడు అని పేర్కొన్నారు. నల్లగొండను కేవలం ఒక పట్టణంగా కాదు.. దేశం గర్వించేలా ఒక ‘క్లీన్ – గ్రీన్ – స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే నా జీవిత ఆశయమని తెలిపారు.
Read Also: గర్భిణి మెటర్నిటీ ఫొటో షూట్.. మొదటి బిడ్డ దుర్మరణం
Follow Us On: Instagram


