కలం మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఏకంగా ఐదు మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్య నేతలను ఉద్దేశించి సినిమా డైలాగులతో కామెంట్లు చేశారు. బుల్లెట్ దిగిందా లేదా అంటూ కౌంటర్ ఇచ్చారు.
మెదక్ ఎంపీ రఘునందన్ (MP Raghunandan Rao) ఎక్స్ అఫీషియో ఓటుతో ఇస్నాపూర్, బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో జిన్నారం, మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను దక్కించుకున్నది. ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఒకే కారులో రావడం విశేషం.
Read Also: చైతన్యపురిలో నరబలి కలకలం!
Follow Us On : WhatsApp


