epaper
Wednesday, February 18, 2026
epaper

ద్రాక్షారామంలో ఘనంగా మహా శివరాత్రి మహోత్సవాలు

కలం, వెబ్ డెస్క్ : పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం (Draksharamam) మహా శివరాత్రి సందర్భంగా అపార భక్తి భావంతో కళకళలాడింది. భీమేశ్వర స్వామివారి ఆలయం తెల్లవారుజామున నుంచే భక్తులతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినం కావడంతో అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. “హర హర శంభో శంకర” నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు బిల్వదళాలు సమర్పిస్తూ, పాలు, తేనె, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ (Draksharamam Temple) పరిసరాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 Read Also: మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>