మెక్ డొనాల్డ్స్‌ ఫ్రాంచైజీలో కల్తీ ఆహారం కలకలం

కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ (Rajasthan) లోని జైపూర్‌లో జరిగిన ఓ ఘటన సంచలనం రేపింది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ అయిన మెక్ డొనాల్డ్స్‌ (McDonalds) ఫ్రాంచైజీలో సుమారు 40 లీటర్ల వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. తనిఖీ సమయంలో దాదాపు 650 కిలోల కల్తీ పన్నీర్, కుళ్లిపోయిన టమోటాలు, నాసిరకం ఆహార పదార్థాలు లభించాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పాట్‌లోనే వాటిని డిస్పోజ్  చేశారు. వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడిన ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

ప్రముఖ బ్రాండ్ (McDonalds) అయినప్పటికీ ప్రతీ ఫ్రాంచైజీ శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుందనే భావన తప్పని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో వినియోగదారులు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: 3 సూత్రాలు.. 7 చక్రాలు : రేపటి నుంచి ఏఐ సమ్మిట్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>