కలం, తెలంగాణ బ్యూరో: Municipal Election Results | మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెల్చుకొని మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడ్డాయి. కనీసం 85% స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ భావించినా ఆశాభంగం ఎదురైంది. రెండేండ్ల తర్వాత అధికారం మాదే.. అర్బన్‌లో ఢోకా లేదు.. అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇరవై మున్సిపాలిటీలను కూడా చేజిక్కించుకోలేకపోయింది. కేసీఆర్ గజ్వేల్ కోటలో బొటాబొటిగా మ్యాజిక్ ఫిగర్‌తో గట్టెక్కింది. నెక్స్ట్ టైమ్ తెలంగాణలో పవర్ మాదే అని గొప్పగా ప్రకటించుకున్న బీజేపీ ఫస్ట్ టైమ్ కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్నా మున్సిపాలిటీల్లో ఒక్కదానితోనే సరిపెట్టుకున్నది. మున్సిపోల్స్ ను పార్టీల అగ్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేడర్‌ను జోష్‌లో ముంచెత్తారు. ఏ నాయకుడి పలుకుబడి ఎంత పనికొచ్చింది?.. తిరుగే లేదనుకున్నచోట ఎన్ని సీట్లు వచ్చాయి?.. ఎవరి ఇమేజ్ ఎంత పెరిగింది?… ఎవరికెంత డ్యామేజ్ అయింది?..
వీటిపై ‘కలం’ ప్రత్యేక కథనం కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఎనిమిది కోట్లు పన్ను కట్టినా తప్పని ఓటమి
Follow Us On : WhatsApp


