కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో (Sangareddy Municipality) ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ అభ్యర్థికి రెండు ఓట్లు మాత్రమే రాగా రీకౌంటింగ్ చేపిస్తే ఒక్కటే ఓటు వచ్చినట్లు తేలింది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే సదరు అభ్యర్థి కుటుంబంలోనే ఆరుగురు ఓటర్లు ఉన్నారు. కానీ, తనకు మాత్రం ఒక్కటే ఓటు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జంగా కొమురయ్య (Janga Komuraiah) జనసేన అభ్యర్థి (Janasena Candidate)గా పోటీ చేశారు. నేడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లిన కొమురయ్యకు షాకింగ్ రిజల్ట్స్ ఎదురయ్యాయి. ఆయనకు కేవలం రెండు ఓట్లే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఫలితాలపై అనుమానం ఉందని, మరోసారి లెక్కించాలని కొమురయ్య అధికారులను కోరాడు. రీకౌంటింగ్ చేసిన అధికారులు కొమురయ్యకు మరో షాక్ ఇచ్చారు. రీకౌంటింగ్‌లో ఆయనకు ఒక్కటే ఓటు వచ్చినట్లు చెప్పారు. ఆయన కుటుంబంలోనే ఆరుగురు ఓటర్లు ఉన్నా ఒకే ఓట్ రావడంపై కొమురయ్య తీవ్ర నిరాశ చెందాడు. ముందు రెండు ఓట్లు, రీకౌంటింగ్‌లో ఒక్క ఓటు వచ్చిన కొమురయ్య కథ విన్న జనం అయ్యో పాపం అంటూనే నవ్వుకుంటున్నారు.
Read Also: చైర్మన్ పదవికే గురి.. జనగామలో స్వతంత్రుల డిమాండ్
Follow Us On : WhatsApp


