కలం,మెదక్ బ్యూరో : మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Raja Narasimha) తన సొంత ఇలాకాలో పట్టు నిలుపుకున్నారు. తాజాగా వెలువడ్డ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆందోల్-జోగిపేటలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ 3 స్థానాలకే పరిమితమైనది. ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. గెలుపొందిన అభ్యర్థులకు మంత్రి దామోదర అభినందనలు తెలిపారు.
Read Also: జనసేన అభ్యర్థికి ఒక్క ఓటే.. కథ తెలిస్తే కామెడీ!
Follow Us On: Sharechat


