Mobile Popup Ad
Mobile Popup Ad

పాక్ మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ హెల్త్ అప్డేట్!

కలం, స్పోర్ట్స్ :  టీ20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరు ఇప్పటికే అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని చెప్పి ఆ తర్వాత పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అంచనాలు మరింత అధికం అయ్యాయి. అదే సమయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. భారత్ జట్టుకు దూరమయ్యారు. ఆరోగ్య కారణాల వల్లే అతడు జట్టు నుంచి తప్పుకున్నాడు. కాగా దాయాది పాక్‌తో పోరుకు భారత్ సన్నద్ధం అవుతున్న వేళ అభిషేక్ తన ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ముంబైలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నప్పటికీ, పూర్తి ఆరోగ్యంతో లేకపోవడంతో తొలి బంతికే డకౌట్ అయ్యారు. ఆ తర్వాత డీహైడ్రేషన్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ కారణంగా ఆయన రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది.

అనారోగ్యం కారణంగా తాను దాదాపు రెండు కిలోల బరువు తగ్గానని అభిషేక్ శర్మ పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నమీబియా మ్యాచ్ సమయంలో స్టేడియానికి వచ్చినప్పటికీ, బలహీనత కారణంగా ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ప్రస్తుతం కోలుకునే క్రమంలో భాగంగా కేవలం పప్పు, అన్నం మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు అభిషేక్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, అతను తిరిగి జట్టులోకి రావడానికి ఒకటి రెండు మ్యాచ్‌లు పట్టవచ్చని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమీబియాతో టాస్ సమయంలో సూచించారు.

పాకిస్థాన్‌పై మంచి రికార్డు ఉన్న అభిషేక్ శర్మ ఈ కీలక మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద లోటేనని చెప్పాలి. గత ఆసియా కప్‌లో పాక్‌పై ఆయన 189 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు సాధించారు. ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ అతని స్టామినాను నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ తన గత మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల భారీ విజయాన్ని సాధించి మంచి ఊపులో ఉంది. అభిషేక్ (Abhishek Sharma) తిరిగి ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>