Mobile Popup Ad
Mobile Popup Ad

విజయోత్సవాలకు అనుమతి లేదు: పోలీస్ కమిషనర్

కలం, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, ఇల్లందు, అశ్వారావుపేట పేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా ఎదులాపురం కల్లూరులో విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీస్ కమిషనర్ (Khammam CP) సునీల్ దత్ తెలిపారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెక్షన్‌ 163 BNSS అమల్లో ఉన్నందున ఎలాంటి విజయోత్సవాలు, ర్యాలీలు జరుపకూడదన్నారు. బాణాసంచా కాల్చడం, డీజే వినియోగం, బైక్‌, ఇతర ర్యాలీలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, గుంపులుగా తిరగడం నిషేధం అని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అల్లర్లు సృష్టిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>