కలం, నల్లగొండ : నల్గొండ (Nalgonda) కార్పొరేషన్ ఎన్నికల్లో పలు డివిజన్ లో డీఎస్పీ శివరాం రెడ్డి సమక్షంలోనే దొంగ ఓటు వేయించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshith Reddy) ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 10వ డివిజన్ లోజరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టి డీఎస్పీ శివరాం రెడ్డిని సస్పెండ్ చేయాలని ఈసీకి (EC) ఫిర్యాదు చేసినట్టు వర్షిత్ రెడ్డి తెలిపారు. డీఎస్పీపై చర్యలు తీసుకోకపోతే బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని వెల్లడించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారని, పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లకు తెరలేపారంటూ మండిపడ్డారు వర్షిత్ రెడ్డి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) కనుసైగల్లో పోలీసు ఉన్నతాధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం అలవాటు అయిందని హర్షిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు మజ్లిస్- మైనార్టీ ఓట్ల మీద ధ్యాసే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఏకోశాన లేదని మండిపడ్డారు శివరాం రెడ్డి. ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బిజెపి నల్గొండ (Nalgonda) పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా ప్రధానకార్యదర్శి పోతెపాక లింగస్వామి, బిజెపి జిల్లా నాయకులు మంగిలిపల్లి కిషన్, పిండి పాపి రెడ్డి, BJYM రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, బిజెపి పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Read Also: వాట్సాప్‌ను బ్లాక్ చేసిన రష్యా
Follow Us On: Pinterest


