epaper
Wednesday, February 18, 2026
epaper

టీ20 వరల్డ్​ కప్​: మెరిసిన ఇషాన్​, హార్థిక్​.. భారత్​ ఘన విజయం

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​లో (T20 World Cup) భారత్​ ఖాతాలోకి మరో విజయం చేరింది (India Vs Namibia). గురువారం ఢిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్​లో 93 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన భారత్​ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్​ ఇషాన్​ కిషన్​ (61; 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్​లు), ఆల్​రౌండర్ హార్థిక్​ పాండ్యా(52; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్​లు) మెరుపు అర్ధసెంచరీలతో రాణించారు. సంజు శాంసన్​(22; 8 బంతుల్లో 1 ఫోర్​, 3 సిక్స్​లు), తిలక్​ వర్మ(25; 21 బంతుల్లో 3 ఫోర్లు), శివమ్​ దూబె(23; 16 బంతుల్లో 1 ఫోర్​, 1 సిక్స్​) ఓ మోస్తరు పరుగులు చేశారు. కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​(12; 13 బంతుల్లో 1 సిక్స్​) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో కెప్టెన్​ గెరార్డ్​ ఎరాస్​మస్​ (4/20) భారత్​ను దెబ్బతీశాడు. బెర్నార్డ్​ స్కాల్జ్​, జెజె స్మిత్​, బెన్​ షికోంగో తలో వికెట్​ పడగొట్టారు.

అనంతరం ఛేదన ప్రారంభించిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్​ అయ్యింది (India Vs Namibia). ఓపెనర్​ లారెన్​ స్టీన్​కాంప్​(29; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్​) టాప్​ స్కోరర్​. భారత బౌలర్లలో వరుణ్​ చక్రవర్తి 2 ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్​ పటేల్​, హార్థిక్​ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అర్షదీప్​ సింగ్​, శివమ్​ దూబె, జస్ర్పీత్​ బుమ్రా తలో వికెట్​ దక్కించుకున్నారు. హార్థిక్​ పాండ్యాకు ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’ అవార్డు దక్కింది. భారత్​ తన తర్వాతి మ్యాచ్​లో ఈ నెల 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది.

Read Also: అలానే ఆడండి.. భారత్‌కు మాజీ ప్లేయర్ సూచన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>