కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRAA) రూ. 2,200 కోట్ల ఆస్తిని కాపాడింది. మాదాపూర్ (Madhapur) హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని మోండికుంట చెరువు పరిధిలో ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ చర్యతో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
చెరువు పరిధిలో ఆక్రమణలు ఉండటంతో భవిష్యత్తులో నీటి నిల్వ, పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి పై ప్రభావం పడే అవకాశం ఉంది. హైడ్రా (HYDRAA) అధికారులు ఈ సమస్యను గుర్తించి, వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా ప్రకృతి వనరులను కాపాడడమే కాక, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన నీటి భద్రతని అందించారు.
Read Also: రూ.57 లక్షలతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ జంప్
Follow Us On: X(Twitter)