epaper
Wednesday, February 18, 2026
epaper

మామిడికుదురులో అగ్నిప్రమాదం..

కలం, వెబ్​ డెస్క్​ : అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు (Mamidikuduru)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 12 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో నిమిషాల వ్యవధిలోనే గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ప్రమాదం కారణంగా 12 కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయి వీధిన పడ్డాయి. ఇళ్లలో దాచుకున్న నగదు, బంగారంతో పాటు పిల్లలకు సంబంధించిన విలువైన స్కూల్ సర్టిఫికెట్లు కూడా మంటల్లో కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: వాట్సాప్​ను బ్లాక్​ చేసిన రష్యా​​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>