epaper
Wednesday, February 18, 2026
epaper

ఇయర్‌ఫోన్ లేకుండా వింటున్నారా?.. అయితే శిక్ష తప్పదు

కలం, డెస్క్: విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. విమానాల్లో ప్రయాణించే సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇయర్ ఫోన్స్ లేకుండా మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా గట్టిగా మ్యూజిక్ ప్లే (Loud Music on Flights) చేయడం ‘అన్‌రూలీ బిహేవియర్’ కిందకు వస్తుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విమాన ప్రయాణంలో క్రమశిక్షణ పాటించని వారిపై పౌర విమానయాన నియమాల ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. లోక్‌సభ సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాతపూర్వక పై వివరణ ఇచ్చారు.

విమాన ప్రయాణికుల క్రమశిక్షణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటికే సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ (CAR) జారీ చేసిందని మంత్రి గుర్తుచేశారు. 1937 నాటి ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ లోని రూల్ 22, 23, 29 ప్రకారం ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుందన్నారు. రూల్ 22 ప్రకారం ప్రయాణికులను విమానం ఎక్కకుండా నిరోధించడం లేదా మధ్యలోనే దించేయడం గురించి వివరిస్తుందని తెలిపారు. రూల్ 23 మాత్రం విమాన భద్రతకు లేదా క్రమశిక్షణకు విఘాతం కలిగించే వ్యక్తులను అదుపు చేసే అధికారాన్ని పైలట్-ఇన్-కమాండ్‌కు కల్పిస్తుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడం లేదా శిక్షించడం గురించి రూల్ 29లో క్లారిటీ ఉన్నదన్నారు.

ఎక్కువ శబ్దంతో వినడం క్రమశిక్షణా రాహిత్యమే :

విమానాల్లో మ్యూజిక్ ప్లే చేయడంపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన సంస్థలు సాధారణంగా విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తక్కువ శబ్దంతో కూడిన మృదువైన వాయిద్య సంగీతాన్ని ప్లే చేస్తాయని, కానీ ప్రయాణికులు వ్యక్తిగత పరికరాల్లో ఇయర్ ఫోన్స్ లేకుండా పెద్ద శబ్దంతో సంగీతం వినడం (Loud Music on Flights) ద్వారా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, అది క్రమశిక్షణా రాహిత్యమేనని స్పష్టం చేశారు. విమానాల్లో వీడియో బ్లాగింగ్ (Vlogging) చేయడంపై కూడా ఆంక్షలున్నాయన్నారు. రూల్ 13 ప్రకారం, డీజీసీఏ లైసెన్స్ ఉన్న విమానాశ్రయాల్లో లేదా విమానం గాల్లో ఉన్నప్పుడు ముందస్తు అనుమతి లేకుండా ఫోటోగ్రఫీ లేదా వీడియోలు తీయడం నిషిద్ధమని, చాలాకాలంగా ఈ నిబంధన అమలవుతున్నదన్నారు.

ఇవేమీ కొత్త చట్టాలు కావని, ఆల్రెడీ అమల్లో ఉన్నవేనని గుర్తుచేశారు. అందువల్ల మ్యూజిక్ ప్లే చేయడానికి సంబంధించి ప్రత్యేకంగా కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం లేదని, అలాంటి ఆలోచన లేదా ప్రతిపాదన లేదన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలే అసహజ ప్రవర్తనను అరికట్టడానికి సరిపోతాయని మంత్రి వ్యాఖ్యానించారు.

Read Also: షాకింగ్​.. మిగిలిన కూల్​ డ్రింక్స్ ని తిరిగి బాటిల్స్ లో​ పోసి అమ్మేస్తున్నారు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>