epaper
Wednesday, February 18, 2026
epaper

అల్లు అర్జున్ ప్రోటోకాల్ రూల్స్‌పై స్పందించిన నిర్మాత వంశీ నందిపాటి

కలం, సినిమా : రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రోటోకాల్ (Allu Arjun Protocol) రూల్స్‌ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత వంశీ నందిపాటి(Vamsi Nandipati) స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. బన్నీ ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఎవరైనా కలిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. అంత పెద్ద స్టార్ అయినా ఆయనలో ఎలాంటి అహంకారం ఉండదని వంశీ తెలిపారు.

అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్నా.. ఆయన ఎప్పుడూ అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతారు. సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా పుకార్లేనని వంశీ తేల్చి చెప్పారు. కొంతమంది కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. బన్నీ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని వంశీ  పేర్కొన్నారు.

Read Also: “ఉప్పెన” 5 ఏళ్లు పూర్తి.. బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>