కలం, వెబ్ డెస్క్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ గ్రూప్ A మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ అరున్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రేక్షకులు తాగి వదిలేయగా మిగిలిన డ్రింక్స్ ను విక్రేతలు తిరిగి బాటిల్ లో నింపేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రేక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్టేడియం నిర్వహకులు, బీసీసీఐ, ఐసీసీ, డీడీసీఏ, కోకా – కోలా వంటి సంస్థ నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
మిగిలిన కూల్ డ్రింక్స్ ని తిరిగి బాటిల్స్ లో పోసి అమ్మేస్తున్నారు!
ఢిల్లీలోని అరున్ జైట్లీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా అక్కడి కూల్ డ్రింక్ షాప్ నిర్వహులు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. తాగిన వదిలేసిన తరువాత మిగిలిన కూల్ డ్రింక్స్ ను మళ్లీ బాటిల్ లో… pic.twitter.com/m0VIZK8IU7
— Kalam Daily (@kalamtelugu) February 12, 2026
Read Also: బాబోయ్.. భయపెట్టిన భారీ సింక్ హోల్!
Follow Us On: Pinterest


