epaper
Wednesday, February 18, 2026
epaper

రాహుల్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయండి.. స్పీకర్‌కు ఎంపీ నిషికాంత్ నోటీసులు

క‌లం, వెబ్ డెస్క్‌: రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్ల‌మెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) స్పీక‌ర్‌కు నోటీసులు దాఖలు చేశారు. ఈ నోటీసుల‌పై పార్లమెంట్ ప్రాంగణంలో నిషికాంత్ దూబే మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ స‌భా హ‌క్కుల‌ను ఉల్లంఘించార‌ని ఆయ‌న ఆరోపించారు. కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌లో ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రుల‌పై రాహుల్ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని పేర్కొన్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై (India – US Trade Deal) రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌న్నారు. జియో పాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రాహుల్ అర్ధ‌ర‌హితంగా మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ స్పీక‌ర్‌కు ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ నోటీసు ఇచ్చారు.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సందర్భంగా సోరోస్ ఫౌండేషన్, యూఎస్ఎయిడ్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో చేతులు కలిపి, భారత్‌కు వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యారని తన నోటీసులో ప్రస్తావించినట్లు నిషికాంత్ దూబే (Nishikant Dubey) చెప్పారు. ఇది ప్రివిలేజ్ మోషన్ కాద‌ని, స్వతంత్రంగా తీసుకొచ్చిన సబ్‌స్టాంటివ్ మోషన్ అని తెలిపారు. ఇందులో రాహుల్ గాంధీ థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాలకు వెళ్లి విదేశీ సంస్థలతో కలసి దేశ వ్యతిరేక శక్తులతో పని చేస్తున్నారని పేర్కొన్న‌ట్లు తెలిపారు. సభ ఆమోదానికి సమర్పించే స్వతంత్ర ప్రతిపాదనను ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ అంటారు. స్పీకర్ అనుమతిస్తేనే ఆ అంశాన్ని సభలో చర్చకు తీసుకుంటారు. బీజేపీ ఎంపీ దాఖ‌లు చేసిన ఈ నోటీసులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: PSL 11కు 8 జట్లు ఖరారు.. డ్రాఫ్ట్‌కు గుడ్‌బై

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>