తగ్గేదే లే అంటున్న అంబటి రాంబాబు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబ‌టి రాంబాబు (Ambati Rambabu)కు పోలీసులు వ‌రుస షాక్‌లు ఇస్తున్నారు. సీఎం చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో అంబ‌టి రాంబాబును పోలీసులు జ‌న‌వ‌రి 31న అరెస్ట్ చేశారు. ఆయ‌న‌ను ఇదే కేసులో రిమాండ్ విధించి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అనంత‌రం ఈ కేసులో అంబ‌టికి బెయిల్ వ‌చ్చింది. అయితే న‌వంబ‌ర్ 12న ప‌ట్టాభిపురంలో వైసీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో అంబ‌టి రాంబాబు పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని మ‌రో కేసు న‌మోదైంది.

దీంతో అంబ‌టి జైలులోనే ఉండాల్సి వ‌చ్చింది. అయితే బుధ‌వారం ఈ కేసులో సైతం అంబ‌టికి బెయిల్ రాగా, 2023లో సంక్రాంతి సంబ‌రాల‌కు సంబంధించి లక్కీ డ్రా వసూళ్ల కేసులో పోలీసులు అంబ‌టికి (Ambati Rambabu) పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయ‌న‌ను ఈరోజు గుంటూరు కోర్టుకు (Guntur Court) తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా అంబ‌టి రాంబాబు పోలీస్ వాహ‌నంలో నుంచి పుష్ప సినిమా త‌ర‌హాలో త‌గ్గేదే లే(Thaggede Le) అంటూ పోజ్‌ ఇచ్చారు. అంబ‌టి చేసిన సైగ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read Also: చిన్న జీయర్ స్వామిపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>