epaper
Wednesday, February 18, 2026
epaper

పార్లమెంట్​లో రచ్చరచ్చ.. పొట్టుపొట్టు కొట్టుకున్న నేతలు.. వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధుల తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. చట్టాలు రూపొందించాల్సిన నేతలే నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తర్కియేలో జరిగింది. ఆ దేశ పార్లమెంట్​ (Turkish Parliament) లో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బజారు లొల్లిలా పొట్టుపొట్టు కొట్టుకున్నారు. తుర్కియే న్యాయశాఖ మంత్రి అకిన్​ గుర్లెక్​ నియామకం గందరగోళానికి దారితీసింది. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం ఈ గొడవకు ప్రధాన కారణం అయింది. అధికార, ప్రతిపక్ష సభ్యల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

Read Also: వాలంటైన్స్​ డే.. లవర్స్​ కనిపిస్తే ఎముకలు విరిచేస్తామంటూ వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>