కలం, వెబ్ డెస్క్ : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధుల తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. చట్టాలు రూపొందించాల్సిన నేతలే నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తర్కియేలో జరిగింది. ఆ దేశ పార్లమెంట్ (Turkish Parliament) లో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బజారు లొల్లిలా పొట్టుపొట్టు కొట్టుకున్నారు. తుర్కియే న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ నియామకం గందరగోళానికి దారితీసింది. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం ఈ గొడవకు ప్రధాన కారణం అయింది. అధికార, ప్రతిపక్ష సభ్యల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Leaders fighting among themselves in Turkey’s Parliament
టర్కీ పార్లమెంట్ లో ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రెచ్చిపోయిన నాయకులు#TurkishParliament #TurkeyParliament #Parliament #Yurkey #TurkeyLeaders #Kalam #Kalamdaily #Kalamtelugu pic.twitter.com/UGRhJ8DAYn— Kalam Daily (@kalamtelugu) February 12, 2026
Read Also: వాలంటైన్స్ డే.. లవర్స్ కనిపిస్తే ఎముకలు విరిచేస్తామంటూ వార్నింగ్
Follow Us On : WhatsApp


