కలం, డెస్క్ : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు (Municipal Elections), 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ పూర్తి అయింది. మొత్తం పోలింగ్ 73.01 శాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్ జరిగింది. వాతావరణ పరిస్థితులు, అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ వెసలుబాటు కల్పించారు అధికారులు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) అత్యధికంగా చౌటుప్పల్ లో 91.91 శాతం నమోదవగా.. అత్యల్పంగా నిజమాబాద్ లో 59.12 శాతం ఓటింగ్ పోల్ అయింది. పురుషుల ఓట్లు 72.63 శాతం, మహిళల ఓట్లు 73.39 శాతం నమోదయ్యాయి. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల గొడవలు జరిగాయి. కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఈసీ సీరియస్ అయింది. అటు నిజమాబాద్ లో ఎంపీ అరవింద్ (MP Arvind) పోలింగ్ బూత్ లోకి వెళ్లి అధికారులపై ఫైర్ అయ్యారు. ఇంకా కొన్ని చోట్ల చిన్న గొడవలు అయినట్టు పోలీసులు చెప్పారు.
Read Also: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన : హరీష్ రావు
Follow Us On: X(Twitter)


